Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని కబురు.. జూన్ ఒకటో తేదీ కంటే ముందే నైరుతి రుతుపవనాలు

Webdunia
గురువారం, 13 మే 2021 (10:15 IST)
rains
ఎండవేడిమికి నానా తంటాలు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత గడువు అంటే జూన్‌ ఒకటో తేదీ కంటే ముందే వస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్రం, దానికి ఆనుకొని అరేబియా సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు.
 
వచ్చే రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలపై స్పష్టత వస్తుందని ఇస్రోకు చెందిన వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని, అది బలపడి ఆదివారం వాయుగుండంగా మారుతుందని వివరించారు. తరువాత ఉత్తర వాయువ్యంగా పయనించి తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ప్రవేశించి మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని పేర్కొన్నారు.
 
ఇది తుఫాన్‌గా మారిన తరువాత గుజరాత్‌, పాకిస్థాన్‌ తీరం దిశగా పయనిస్తుందని అంచనా వేశారు. తద్వారా ఏపీ, తెలంగాణలో వచ్చే రెండ్రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments