Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీల మోజు మనోళ్లకే ఎక్కువ.. ఇక చెన్నై రైల్వేస్టేషన్‌లో సెల్ఫీలు తీసుకోరాదు..

సెల్ఫీలపై మోజుతో ప్రాణాలు కోల్పోయే వారే సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. సెల్ఫీ క్రేజ్‌లో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచినట్లు అధ్యయనంలో వెల్లడైన నేపథ్యంలో చెన్నై

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (15:27 IST)
సెల్ఫీలపై మోజుతో ప్రాణాలు కోల్పోయే వారే సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. సెల్ఫీ క్రేజ్‌లో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచినట్లు అధ్యయనంలో వెల్లడైన నేపథ్యంలో చెన్నై రైల్వే పోలీసులు (జీఆర్పీ) కీలక నిర్ణయం తీసుకున్నారు.

రైల్వే స్టేషన్లలో జరిగే విషాదకర ఘటనల్లో 30శాతం సెల్‌ఫోన్ల సంబంధితమైనవేనని తమ పరిశోధనలో తేలడంతో రైల్వేస్టేషన్లు, రైళ్లలో సెల్ఫీలను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు జీఆర్‌పీ అధికారులు వెల్లడించారు. 
 
చెన్నై రైల్వే స్టేషన్లు, రైళ్లలో సెల్ఫీలు తీసుకునేందుకు నిషేధం విధిస్తున్నట్లు జీఆర్పీ ప్రకటించింది. ఎవరైనా తమ ఆదేశాల్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా సెప్టెంబర్ నెలలో 22 ఏళ్ల యువకుడు కదులుతున్న రైలులో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడ్డాడని, రెండు నెలల తర్వాత కోమా నుంచి బయటపడిన అనంతరం ఆ యువకుడ్ని పార్థసారథిగా గుర్తించినట్లు పోలీసులు వివరించారు.

అయితే యువకుడు చికిత్సపొందుతూ గత బుధవారమే మృతిచెందాడని తెలిపారు. గతంలో జరిగిన ఇలాంటి మరికొన్ని ఘటనలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు సెల్ఫీలపై నిషేధం విధించాలని నిర్ణయించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments