Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసులో రైల్వే మంత్రి సదానంద గౌడ సన్ అరెస్టు తప్పదా?

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (12:11 IST)
తండ్రుల అధికారాలను అడ్డుపెట్టుకుని వారి సుపుత్రులు ఘనకార్యాలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇపుడు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ్ అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనను ఈ కేసులో అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కన్నడ వర్ధమాన నటి మైత్రేయిను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసినట్టు సమాచారం. తనను మోసం చేశాడంటూ కార్తీక్‌ గౌడపై మైత్రేయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కార్తీక్ గౌడపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల నివేదిక అనంతరం కార్తీక్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఇదే అంశంపై మైత్రేయి మీడియాతో మాట్లాడుతూ ఈ యేడాది మే నెలలో కుషాల్ అనే స్నేహితుని ద్వారా కార్తీక్ గౌడ పరిచయమయ్యాడని, అనంతరం జూన్ 5వ తేదీన మంగళూరులోని తన ఇంటికి కార్తీక్ గౌడ పిలుచుకెళ్లి శారీరకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడని తెలిపింది. పెళ్లికి ముందు ఇలాంటివి తనకు ఇష్టం లేదని చెప్పడంతో అప్పటికప్పడు ఓ పసుపుతాడును మెడలో కట్టాడని తెలిపింది.
 
అప్పటి నుంచి ఇద్దరూ కలిసిమెలిసి తిరిగేవాళ్లమని, అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో జూలై 25 నుంచి మాట్లాడడం కూడా మానేశాడని వాపోయింది. చివరకు ఈ విషయాన్ని అతని తల్లి దృష్టికి ఈ నెల 11న తీసుకెళ్లానని, అప్పట్లో ఆమె సైతం తనను బెదిరించి పంపినట్లు తెలిపింది. ఇప్పుడు మరో అమ్మాయితో అతడికి నిశ్చితార్థం చేస్తున్నారని, తనను పెళ్లి చేసుకుని ఇలా మోసం చేయడం తగదని ఆమె అంటోంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్‌టీ నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 
 
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ ఖండించారు. తన కుమారుడి నిశ్చితార్థం రోజున ఇలాంటి ఆరోపణలు రావడం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మైత్రేయికి అన్యాయమే జరిగి ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా కార్తీక్ గౌడపై రేప్, చీటింగ్ కేసు నమోదు అయ్యింది. కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆమె ఆర్‌టీ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments