Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు టాయ్‌లెట్‌లో మహిళ.. వెంటిలేటర్ నుంచి మొబైల్‌లో వీడియో చిత్రీకరణ

రైలు ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ రైల్వే ఉద్యోగి పాడుపనికి పాల్పడ్డాడు. రైలు బాత్రూమ్‌లో మూత్రవిసర్జనకు వెళ్లే మహిళా ప్రయాణికురాలిని వెంటిలేటర్ నుంచి మొబైల్ ద్వారా వీడియో తీసి అడ్డంగా బుక్కయ్యాడు.

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (09:03 IST)
రైలు ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ రైల్వే ఉద్యోగి పాడుపనికి పాల్పడ్డాడు. రైలు బాత్రూమ్‌లో మూత్రవిసర్జనకు వెళ్లే మహిళా ప్రయాణికురాలిని వెంటిలేటర్ నుంచి మొబైల్ ద్వారా వీడియో తీసి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో రైలు ప్రయాణికులంతా కలిసి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గోరఖ్‌పూర్ - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ముంబై, కళ్యాణ్ నగరానికి చెందిన షేక్ సలీం అనే యువకుడు రైల్వేలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ విధినిర్వహణలో భాగంగా గోరఖ్‌పూర్ - లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ఇదే రైలులోని ఏ-1 ఏసీ కోచ్‌లో థానే నగరానికి చెందిన 50 ఏళ్ల ఓ మహిళ ప్రయాణిస్తూ బాత్రూమ్‌కు వెళ్లింది. దీన్ని గమనించిన సలీం... వెంటిలేటరు నుంచి తన మొబైల్‌ఫోన్ సాయంతో రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. 
 
ఇంతలో మొబైల్ ఫోన్ అలారం మోగడంతో బాత్రూమ్‌లో ఉన్న మహిళకు తనను రహస్యంగా చిత్రీకరిస్తున్నట్లు గుర్తించింది. తోటి ప్రయాణికుల సాయంతో సలీంను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఆ తర్వాత అతని మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేయగా అందులో అనేక అర్ధనగ్న ఫోటోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదుమేరకు నిందితుడైన సలీంపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

ఫతే ప్రచారంలో సోనూ సూద్‌కి పంజాబ్ లో నీరాజనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

తర్వాతి కథనం
Show comments