జీతాన్ని ముట్టుకోని జైలు సూపరింటెండెంట్.. పైసా ఖర్చు చేయలేదు..

Webdunia
శనివారం, 7 మే 2022 (15:17 IST)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  ఓ అధికారి చిక్కాడు. కొన్నేళ్ల నుంచి జీతాన్నే ముట్టుకోని ఆ అధికారికి చిక్కులు తప్పలేదు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. 
 
సహర్సా జైలు సూపరింటెండెంట్ సురేష్ చౌదరి ఆవరణలో స్పెషల్ విజిలెన్స్ యూనిట్ దాడులు నిర్వహించి భారీ ఆస్తులను వెలికితీశారు.
 
వివరాల్లోకి వెళితే.. సహర్సా జైలు సూపరింటెండెంట్ సురేష్ చౌదరి రూ. 4 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన ఇల్లు, కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కలిగి ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ఒక్క పైసా జీతం ఖర్చు చేయడం లేదు. అతని ఖాతాలోకి వెళ్లే డబ్బు బయటకు రావడం లేదు. 
 
శుక్రవారం ముజఫర్‌పూర్‌లోని చౌదరి నివాసం, సహర్సాలోని కార్యాలయంలో ఎస్వీయూ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సోదాల్లో దొరికిన ఆస్తి అతని ఆదాయానికి నాలుగు రెట్లు ఎక్కువ.
 
తుది నివేదిక వచ్చిన తర్వాత చౌదరి ఆస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎస్వీయూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నయ్యర్ హస్నేన్ ఖాన్ తెలిపారు. 
 
సురేశ్ చౌదరి ముజఫర్‌పూర్ నివాసం, సహర్సా కార్యాలయంపై జరిపిన దాడుల్లో రెండు విలాసవంతమైన భవనాలు బయటపడ్డాయని, వాటి విలువ రూ. 4 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments