Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 25వ తేదీన రాహుల్‌కు పట్టాభిషేకం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 25ను ముహూర్తంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (09:51 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 25ను ముహూర్తంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు, ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.
 
ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 10 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, రాహుల్ గాంధీ దీపావళి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టనున్నట్టు రాజస్థాన్‌కు చెందిన ఆ పార్టీ నేత సచిన్ పైలట్ రెండు రోజుల క్రితమే వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. 
 
కాగా, ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలంటూ ఆ పార్టీ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా సోనియా గాంధీ అనారోగ్యం బారిన పడిన తర్వాత ఈ డిమాండ్లు ఊపందుకున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments