Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాసన్‌లో 100 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (14:12 IST)
కర్నాటక రాష్ట్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీ కరోనా హాట్‌స్పాట్‌గా నిలించింది. ఈ కాలేజీకి చెందిన 21 మందికి కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత వీరితో కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు చేయగా, మొత్తం 100 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని హ‌స‌న్ జిల్లాలోని ఓ ప్రైవేటు న‌ర్సింగ్ కాలేజీలో శుక్ర‌వారం 21 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. మొత్తం ఆ కాలేజీలోని 48 మంది విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 21 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
పాజిటివ్ వ‌చ్చిన విద్యార్థుల‌తంగా గ‌త నెల 17 నుంచి 21 నుంచి కేర‌ళ నుంచి వ‌చ్చిన‌వారేన‌ని జిల్లా అధికారులు తెలిపారు. అయితే, క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా వాళ్ల‌లో ఎవ‌రికీ సింప్ట‌మ్స్ లేవ‌ని చెప్పారు.
 
అయితే, ఒకే న‌ర్సింగ్ కాలేజీలో 21 మందికి పాజిటివ్ రావ‌డంతో అధికారులు హ‌స‌న్ జిల్లాలోని 9 న‌ర్సింగ్ కాలేజీల్లోగ‌ల 900 మంది విద్యార్థుల‌కు క‌రోనా ప‌రీక్షలు చేయించారు. ఆ 900 మందిలో 100 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
వారిలో 24 మంది మొద‌ట పాజిటివ్‌గా తేలిన 21 మందికి ప్రైమ‌రీ కాంటాక్ట్స్ అని ఆరోగ్య అధికారి డాక్ట‌ర్ విజ‌య్ వెల్ల‌డించారు. ఆ 24 మంది తొలి డోసు టీకా వేయించుకున్న వారేన‌ని చెప్పారు. వీరందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments