Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి రావడం భార్యకు - ఫ్యామిలీకి ఇష్టం లేదు : రఘురాం రాజన్

ఠాగూర్
బుధవారం, 29 మే 2024 (09:21 IST)
తాను రాజకీయాల్లోకి రావడం తన భార్యతో పాటు కుటుంబ సభ్యులకు సుతరామా ఇష్టం లేదని భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. అదేసమయంలో తాను రాజకీయాల్లోకి రావడానికి బదులు తనకు తోచినచోట ఇష్టంగా పని చేయడం లేదా సహాయం చేస్తానని తెలిపారు. 
 
కాగా, ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై ఆయన స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం తన భార్యకు, కుటుంబానికి ఇష్టం లేదన్నారు. రాజకీయాల్లోకి రావడానికి బదులు తనకు తోచినచోట సహాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నా... లేకపోయినా వారి విధానాలు దారితప్పితే తాను ఖచ్చితంగా మాట్లాడుతానని వెల్లడించారు. రాజకీయాల్లో ఉండాలన్నా, జనాల మధ్య ఉండాలన్నా తన వల్ల కాదని స్పష్టం చేశారు.
 
అదేసమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రసంసల వర్షం కురిపించారు. రాహుల్ చాలా తెలివైనవాడని... ధైర్యవంతుడన్నారు. ఆయనకు తాను సలహాలు ఇచ్చానని ఎవరైనా అనుకుంటే పొరపాటు అన్నారు. కరోనా సమయంలో రాహుల్ సరిగ్గానే వ్యవహరించారని తాను భావిస్తున్నానని చెప్పారు. నాయనమ్మను, తండ్రిని కోల్పోయిన కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడవద్దన్నారు.
 
అదేసమయంలో రాహుల్ గాంధీ వద్ద అన్నింటికీ సమాధానాలు లేవని కూడా అభిప్రాయపడ్డారు. అందరు చూస్తున్న దానికంటే రాహుల్ భిన్నమైన వ్యక్తిత్వం కలిగివున్నారని తెలిపారు. చాలా అంశాలపై ఆయనకు స్పష్టత ఉందని... ఆయా అంశాలపై ఏకీభవించకుంటే వాటిపై చర్చ జరపాలని సూచించారు. ఆ చర్చలకు ఆయన కూడా సిద్ధంగానే ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments