Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకపై కుందేలు మాంసం తినొచ్చు... చట్టబద్ధంగా విక్రయాలు!

పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అంటుంటారు కదా! అందుకే... మాంసాహారాన్ని ఇష్టపడే వారికి మరో రకం మాసం అందుబాటులోకి రానుంది. ఇకపై దేశవ్యాప్తంగా కుందేలు మాంసం అందుబాటులోకి రానుంది.

Webdunia
గురువారం, 28 జులై 2016 (10:16 IST)
పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అంటుంటారు కదా! అందుకే... మాంసాహారాన్ని ఇష్టపడే వారికి మరో రకం మాసం అందుబాటులోకి రానుంది. ఇకపై దేశవ్యాప్తంగా కుందేలు మాంసం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆహార భద్రతా చట్టానికి కేంద్రం తాజాగా మార్పులు చేసింది. 
 
వాస్తవానికి కేరళ, జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లోని చాలామంది కుందేలు, చెవుల పిల్లుల మాంసాన్ని ఆరగిస్తుంటారు. కేరళలో అయితే ఏకంగా 15 వేల కుటుంబాలు ఈ మాంసం కోసమే కుందేళ్ళను పెంచుతూ జీవిస్తున్నారు. 
 
అయితే, దేశ వ్యాప్తంగా కుందేలు మాంసాన్ని తినడానికి ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అనుమతి లేదు. కేవలం గొర్రెలు, మేకలు, పందులు, గేదెలు, అడవిదున్న వంటి పశుమాంసాన్ని తినడానికే ఇది అనుమతిచ్చింది. 
 
ఈ నేపథ్యంలో, కుందేలు మాంసాన్ని కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి జాబితాలో చేర్చాలని ప్రధానమంత్రి కార్యాలయానికి భారీగా వినతులు వచ్చాయి. దీంతో, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రధాని తమను ఆదేశించారని, అందుకే కుందేలు మాంసాన్ని కూడా ఈ జాబితాలోని చేర్చినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వర్గాలు ప్రకటించాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments