Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం... 40 ఏళ్ల మహిళను గొడ్డలితో నరికి మృతదేహం పక్కనే నిలబడి వీడియో...

రాక్షసత్వం పెచ్చరిల్లిపోతోంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మనిషిని మరో మనిషి అత్యంత కిరాతకంగా హతమారుస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. కారణం ఏదైతేనేం ఈ దారుణాలు మాత్రం రాక్షసులనే గుర్తుకు తెస్తున్నాయి. అసలు రాక్షసులు అంటే ఎలా వుంటారో తెలియదు కానీ..

Webdunia
సోమవారం, 29 మే 2017 (15:30 IST)
రాక్షసత్వం పెచ్చరిల్లిపోతోంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మనిషిని మరో మనిషి అత్యంత కిరాతకంగా హతమారుస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. కారణం ఏదైతేనేం ఈ దారుణాలు మాత్రం రాక్షసులనే గుర్తుకు తెస్తున్నాయి. అసలు రాక్షసులు అంటే ఎలా వుంటారో తెలియదు కానీ.. ఇలా కత్తులు, గొడ్డళ్లు, మారణాయుధాలతో తోటి మనిషిని దారుణంగా నరికి చంపుతున్నవారిని చూసినప్పుడు మాత్రం వారే రాక్షసులా అని అనుకోవాల్సి వస్తుంది. ఆదివారం నాడు పంజాబ్ లుధియానాలో ఓ ఘోరం జరిగింది. జనం అంతా చూస్తుండగానే నడిరోడ్డుపై 40 ఏళ్ల మహిళను అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే... పంజాబ్ లుథియానాకు 30 కిలోమీటర్ల దూరంలో వున్న కిలా రాయ్‌పూర్ అనే గ్రామానికి చెందిన సరబ్జిత్ కౌర్ 40 ఏళ్ల మహిళ తన ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మణిందర్ సింగ్ అనే యువకుడు హఠాత్తుగా ఆమెపై గొడ్డలితో విరుచుకపడ్డాడు. ఆమె మెడపైన విచక్షణా రహితంగా నరకాడు. ఆమె కిందపడిపోగానే చెస్ట్ పైన గొడ్డలితో పదేపదే నరికి చంపాడు. ఆమె రక్తపు మడుగులో పడి విగతజీవిగా మారిన తర్వాత ఆమె మృతదేహాన్ని తన స్మార్ట్ ఫోనులో చిత్రించాడు. 
 
ఆ తర్వాత ఆమె మృతదేహం ప్రక్కనే నిలబడి, ఆమెను చంపడానికి కారణాన్ని చెపుతూ తనకు తనే కెమెరాలో షూట్ చేసి ఆ వీడియోను నెట్లో అప్ చేశాడు. ఆ మహిళను తనే హత్య చేశానని వీడియోలో చెప్పాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... ఇతడికి మరో యువతితో అక్రమ సంబంధం వున్నది. 
 
ఈ విషయం సరబ్జిత్ కౌర్ కు తెలియడంతో తనను ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందనీ, ఈ విషయాన్ని బయటపెడతానని పదేపదే బెదిరిస్తుండటంతో దాన్ని తట్టుకోలేక ఆమెను నరికి చంపినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments