Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక సంబంధం పెట్టుకో.. పీహెచ్‌డీ సీటు ఇస్తా... స్కాలర్‌కు ప్రొఫెసర్ టార్చర్

నాతో లైంగిక సంబంధం పెట్టుకో.. నీకు పీహెచ్‌డీ సీటు ఇస్తాను అంటూ ఓ స్కాలర్‌ను కామాంధుడైన ఒక ప్రొఫెసర్ లైంగికంగా వేధించాడు. ఈ వేధింపులను తాళలేని ఆ స్కాలర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (08:50 IST)
నాతో లైంగిక సంబంధం పెట్టుకో.. నీకు పీహెచ్‌డీ సీటు ఇస్తాను అంటూ ఓ స్కాలర్‌ను కామాంధుడైన ఒక ప్రొఫెసర్ లైంగికంగా వేధించాడు. ఈ వేధింపులను తాళలేని ఆ స్కాలర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. మహారాష్ట్రలోని పూణేలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మహారాష్ట్రలోని పూణే నగరంలో యశ్వంతరావు మొహితే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్సు అండ్ కామర్స్ కళాశాల ఉంది. ఇందులో 53 యేళ్ళ శివాజీ బొర్హాడే అనే వ్యక్తి ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈయన వద్దకు పీహెచ్‌డీ చేసేందుకు ఇరాన్ దేశానికి చెందిన 31 ఏళ్ల మహిళ పీజీ పూర్తి చేసి, అకౌంట్స్‌లో పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించింది. 
 
ఈనెల 8వతేదీన ఇరాన్ మహిళ తనకు పీహెచ్‌డీ సీటు ఇవ్వాలని ప్రొఫెసర్ బొర్హాడేను కోరింది. తనతో లైంగిక సంబంధం పెట్టుకొని తన కోరిక తీరిస్తే పీహెచ్‌డీ సీటు ఇస్తానని ప్రొఫెసర్ సెలవియ్యడంతో ఆ ఇరాన్ మహిళ షాక్‌కు గురైంది. వెంటనే ప్రొఫెసర్ గదిలోనుంచి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్లిన ఇరాన్ మహిళ స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి తన కోరిక తీర్చమన్న ప్రొఫెసరుపై పూణే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు ప్రొఫెసరు శివాజీ బొర్హాడేపై ఐపీసీ సెక్షన్ 354 (ఎ) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడైన శివాజీ బొర్హాడే తన నేరాన్ని అంగీకరించి క్షమాపణలు చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం