Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ నగరాల ‘టాప్ 20 జాబితా’లో హైదరాబాద్! మల్టీ మిలియనీర్ల సంఖ్య...!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (12:35 IST)
మల్టీ మిలియనీర్ల సంఖ్య శరవేగంగా పెరగడంతో ప్రపంచ నగరాల టాప్ 20 జాబితాలో హైదరాబాద్‌కు స్థానం లభించింది. పదేళ్ల క్రితం నగరంలో 160 మంది మల్టీ మిలియనీర్లు ఉంటే, గతేడాదికి వీరి సంఖ్య 510కి చేరింది. అంటే, కేవలం పదేళ్ల కాలంలోనే ఈ సంఖ్య మూడింతలకు పైగా పెరిగిందన్న మాట. రూ.62.5 కోట్ల ఆస్తులున్న వారిని మల్టీ మిలియనీర్లుగా పిలుస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ తరహాలో ఆస్తులు కూడబెట్టి మల్టీ మిలియనీర్లుగా అవతరిస్తున్న హైదరాబాదీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ విషయంలో భారతీయ నగరాల్లో మంగళవారం వరకు పుణే తొలి స్థానంలో వుండేది.

అయితే పుణే కంటే కూడా ఎక్కువ మంది మల్టీ మిలియనీర్లు ఉన్న నగరంగా హైదరాబాద్ ఖ్యాతిగాంచినట్లు ‘న్యూ వరల్డ్ వెల్త్ ఆర్గనైజేషన్’ మంగళవారం ప్రకటించింది. పుణేలో 317 మంది మల్టీ మిలియనీర్లుంటే, ఈ సంఖ్య హైదరాబాదులో 510. ఇక ప్రపంచ నగరాల జాబితాలో వియత్నాంలోని హోచిమిన్ సిటీ అగ్రస్థానంలో నిలిచింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments