Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే ఫస్ట్ టైమ్.. 'ఆ'పరేషన్ సక్సెస్... కుమార్తెకు మాతృత్వపు ఆనందాన్నిచ్చిన తల్లి!

వైద్యశాస్త్రంలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు మనదేశ వైద్యులు. దేశంలోనే తొలిసారి గర్భసంచి మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా మార్పిడి చేశారు. తద్వారా తన కుమార్తెకు మాతృత్వపు ఆనందాన్ని ఇచ్చిందో తల్లి. తాజాగా

Webdunia
శనివారం, 20 మే 2017 (16:03 IST)
వైద్యశాస్త్రంలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు మనదేశ వైద్యులు. దేశంలోనే తొలిసారి గర్భసంచి మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా మార్పిడి చేశారు. తద్వారా తన కుమార్తెకు మాతృత్వపు ఆనందాన్ని ఇచ్చిందో తల్లి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సోలాపూర్‌కు చెందిన 21 యేళ్ల యువతికి గర్భసంచిలో సమస్య ఏర్పడటంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆమెకు మాతృత్వపు ఆనందాన్ని ప్రసాదించాలని ఆమె తల్లి నిర్ణయించింది. దీంతో తన గర్భసంచిని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. 
 
దీంతో అత్యంత సంక్లిష్టమైన గర్భసంచి మార్పిడి ఆపరేషన్‌ను చేసేందుకు పుణెలోని గెలాక్సీ కేర్‌ లాప్రోస్కోపీ ఇనిస్టిట్యూట్ వైద్యులు ముందుకు వచ్చారు. ఈ ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని గురువారం చేపట్టారు. ఏకధాటిగా 9 గంటల పాటు ఆపరేషన్ చేసి విజయం సాధించారు. ఆపరేషన్ తర్వాత తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
 
గర్భసంచిని స్వీకరించిన మహిళ గర్భందాల్చాలంటే ఏడాదిపాటు వేచి ఉండాలని, అప్పట్లోగా ఆమె శరీరం నూతన గర్భాశయానికి అలవాటు పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు గర్భసంచి మార్పిడి 30 జరగగా, అందులో కొన్ని కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments