Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఫోటోలను విడుదల చేస్తాం.. అమ్మకు కాలి నొప్పి.. నిలవలేక వణికిపోయేది.. చీర తగులుకుంటే..?

జయలలిత మరణాన్ని ఆయుధంగా తీసుకుని ఓపీఎస్ వర్గం.. శశికళ వర్గంపై విమర్శలు గుప్పించారు. దీంతో శశికళ వర్గం అపోలో అమ్మ చికిత్స పొందిన ఫోటోలను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కర్ణాటక అన్నాడీఎంకే ప్రధాన కా

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (12:40 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత డిసెంబర్ 5వ తేదీన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అపోలోలో అమ్మ చికిత్సకు సంబంధించిన ఫోటోలు విడుదల చేయాలని డిమాండ్ పెరిగిపోతోంది. అయితే ఈ ఫోటోలను అపోలో ఏమాత్రం లీక్ చేయలేదు. ఈ నేపథ్యంలో జయలలిత మరణాన్ని ఆయుధంగా తీసుకుని ఓపీఎస్ వర్గం.. శశికళ వర్గంపై విమర్శలు గుప్పించారు. దీంతో శశికళ వర్గం అపోలో అమ్మ చికిత్స పొందిన ఫోటోలను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కర్ణాటక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పుగళేంది తెలిపారు. 
 
ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మ సన్నిహితులకు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి బాగా తెలుసునన్నారు. చాలాకాలం పాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న జయలలిత... కాలి నొప్పితో నానా తంటాలు పడ్డారు. నిలబడేందుకు కూడా కష్టపడేవారు. కాలి నొప్పితో పర్యటనలు, బహిరంగ సభలను రద్దు చేసుకున్నారని పుగళేంది చెప్పారు. చివరిగా మెట్రో రైలు స్టేషన్ ప్రారంభ వేడుకల్లో అమ్మ నిలవ లేకపోయారు. చేతులు, కాళ్లు చేతులు వణికిపోయానని వెల్లడించారు. 
 
ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఇంటికి తిరుగు ముఖం పట్టేందుకు కారు ఎక్కుతుండగా అమ్మ చీర కాలికి చిక్కుకుంది. ఆ సమయంలో చిన్నమ్మ ఆ చీరను కాలు నుంచి తొలగించి ఆమెను ఇంటికి తీసుకెళ్లారని చెప్పారు. అనారోగ్య సమస్యల కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ.. ఇంట్లోనే వైద్యం అందించుకున్న అమ్మను చివరికి అపోలో చేర్చినట్లు పుగళేంది అన్నారు. అక్కడ ఎన్నోరకాల చికిత్సలు అందించినా ఫలితం లేకపోయిందని ఆయన వాపోయారు. ఆస్పత్రిలో అమ్మ చికిత్స పొందుతున్నప్పుడు తీసిన ఫోటోలను త్వరలో విడుదల చేస్తామని పుగళేంది వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments