దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు మద్దతుగా 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుహళేంది అన్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు శశికళను కలుస
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు మద్దతుగా 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుహళేంది అన్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు శశికళను కలుసుకుంటున్నారని పుహళేంది చెప్పారు.
అక్రమార్జన కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత అరెస్టయిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మందికిపైగా కార్యకర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అందువల్లనే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను విడుదల చేయలేదన్నారు.
శశికళ నేతృత్వంలోనే అన్నాడీఎంకే (అమ్మ) ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. టీటీవీ దినకరన్‌పై అక్రమంగా కేసును బనాయించారని, అయితే, ఆయన నిర్ధోషిగా విడుదలయ్యే సమయం త్వరలోనే వస్తుందని పుహళేంది తెలిపారు.