Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని విజ్ఞప్తి మేరకే గుజరాత్ విద్యార్థులకు ట్రైనింగ్: పీటీ ఉష

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (09:04 IST)
అలనాటి పరుగుల రాణి పీటీ ఉష గుజరాత్లో పిల్లలకు దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చేందుకు సమ్మతించినట్లు తెలిసింది. దేశ ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి మేరకే గుజరాత్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సమ్మత్తించినట్టు తెలిపారు. అక్కడ కొంతమంది బాలలను వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, వారికి చైనా తరహాలో దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వడానికి ఉష అంగీకరించినట్లు పేర్కొన్నారు.
 
అక్కడ 10 - 11 ఏళ్ల వయసున్న 30 మంది పిల్లలను ఎంపిక చేసి, వారికి ప్రాథమిక శిక్షణ ఇచ్చి. ఆ తర్వాత వాళ్లు ఏయే విభాగాలకు సరిపోతారో అంచనా వేసి ఆ ప్రకారం వాళ్లను తీర్చిదిద్దడం ఈ దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యం. సియోల్ ఒలింపిక్స్లో భారత పతాకాన్ని అథ్లెటిక్స్ విభాగంలో పీటీ ఉష విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే ఆమె తన ఊరు సమీపంలో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను తెరిచింది. ఇటీవల ఆమె స్కూలు నుంచి వచ్చిన ముగ్గురు బాగా ప్రతిభ చూపారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్ది, వారి ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనని క్రీడా వర్గాలు అంటున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments