Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాకు దక్కకపోతే నువ్వూ బతకడానికి వీల్లేదు'... తాను విషం తాగి.. ప్రేయసిపై హత్యాయత్నం

కొంతమంది ప్రేమికులు శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారు. దీంతో తాను ప్రేమించిన వ్యక్తి సుఖంగా ఉండాలనుకునే స్వచ్ఛమైన ప్రేమ స్థానంలో.. నాకు దక్కకపోతే నువ్వూ బతకడానికి వీల్లేదు.. నేను చస్తున్నా.. నిన్నూ చంపేస

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (07:57 IST)
కొంతమంది ప్రేమికులు శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారు. దీంతో తాను ప్రేమించిన వ్యక్తి సుఖంగా ఉండాలనుకునే స్వచ్ఛమైన ప్రేమ స్థానంలో.. నాకు దక్కకపోతే నువ్వూ బతకడానికి వీల్లేదు.. నేను చస్తున్నా.. నిన్నూ చంపేస్తా.. అంటూ ఉన్మాదిలా మారిపోతుంటారు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ విషాదఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
తిరుచ్చి జిల్లాలోని పిచ్చాండవర్‌ కోవిల్‌ ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థిని మోనికా(21), అదే ప్రాంతానికి చెందిన బాలా (అలియాస్‌) బాలమురుగన్‌(26) రెండేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. దీనిపై మోనికా తల్లిదండ్రులు మందలించడంతో అప్పట్లో ఇద్దరూ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇది గుర్తించి పెద్దవాళ్లు రక్షించారు. అనంతరం మోనికా చదువుపై దృష్టిసారించింది. అయినా బాలా వెంటపడుతుండడంతో ఇటీవల మందలించింది. 
 
దీంతో ఆగ్రహానికి గురైన బాలా బుధవారం విషం తాగి.. కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న మోనికాను అడ్డుకున్నాడు. తాను విషం తాగిన విషయం చెప్పి.. నువ్వు కూడా జీవించరాదంటూ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి స్పృహ కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన మోనికాను, స్పృహ కోల్పోయిన బాలాను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతున్నారు. మోనికా తండ్రి రవి హెడ్‌ కానిస్టేబుల్‌ కాగా, తల్లి ఫాతిమా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments