Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక గాంధీ కేవలం కాగితపు పులి మాత్రమే.. అఖిలేష్, రాహుల్‌కి చుక్కలు: స్మృతి ఇరానీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. యూపీలో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతల

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (13:24 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. యూపీలో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా ఎక్కువగా ఊహించుకున్నారని.. ప్రియాంకకు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. ఆమె కేవలం కాగితపు పులి మాత్రమేనని తెలిపారు. ఈ ఎన్నికల్లో కులం, మతం కార్డులు పని చేయలేదని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి యూపీ ప్రజలు జై కొట్టారని తెలిపారు. 
 
కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ... ఆ పార్టీలను యూపీ ప్రజలు నమ్మలేదన్నారు. అఖిలేష్, రాహుల్ లను ఓటర్లు దూరం పెట్టారని చెప్పారు. యూపీ ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారని, బీజేపీకి అధికారం కట్టబెట్టారని తెలిపారు. 
 
కాగా ప్రియాంక గాంధీ అమేథీ, బరేలీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. అయితే ప్రియాంక గాంధీ కొన్ని ర్యాలీల్లో మాత్రమే పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాల్లో పర్యటించలేదు. పైగా కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీతో పొత్తుపెట్టుకుంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments