Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేనే జయలలితను మాట్లాడుతున్నాను.. ఆస్పత్రిలో ఉన్నది నేను కాదు.. నా శవం : పన్నీర్‌తో మాంత్రికుడు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత నమ్మినబంటు ఓ.పన్నీర్ సెల్వం. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (08:51 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత నమ్మినబంటు ఓ.పన్నీర్ సెల్వం. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జయలలిత సమాధి వద్ద 40 నిమిషాల పాటు ధ్యానం చేసి.. ఆ తర్వాత అమ్మ ఆత్మ తనతో మాట్లాడిస్తోందంటూ అనేక విషయాలు బహిర్గతం చేశారు. ఇపుడు ఇలాంటిదే మరొకటి జరిగింది. 
 
ఇప్పుడు తాజాగా ఓ మాంత్రికునికి జయ ఆత్మ సాక్షాత్కరించి.. తన మేనకోడలు దీప, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం కలసికట్టుగా పని చేసి అన్నాడీఎంకేను కాపాడాలని సూచించిదని చెప్పాడు. ఆ మాంత్రికుడు మాయల మరాఠీగా పేరుగాంచిన తిరువారూర్‌కు చెందిన వ్యక్తి శ్రీమహర్షి. మంగళవారం స్థానిక అడయార్‌ గ్రీన్‌వేస్ రోడ్డులోని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం నివాసం వద్దకు సఫారీ దుస్తులతో వచ్చారు. 
 
తాను వెంటనే పన్నీర్‌సెల్వాన్ని కలుసుకోవాలని, జయ ఆత్మ తనకు చెప్పిన సంగతిని ఆయనకు తెలియజేయాలంటూ నానా హడావుడి చేశాడు. ఆ సమయంలో అక్కడే వున్న పాత్రికేయులు ఆ మాంత్రికుడిని పలుకరించారు. తాను తిరువారూరులో పేరు ప్రఖ్యాతులు గడించిన మాంత్రికుడినని, జయ ఆత్మ తనతో మాట్లాడుతోందని చెప్పుకొచ్చాడు. 
 
ఆ తర్వాత కొద్దిసేపు కళ్లు మూసుకుని, పూనకం వచ్చినవాడిలో ఊగుతూ.. 'నేనే జయలలితను మాట్లాడుతున్నాను. ఆసుపత్రిలో 75 రోజులపాటు ఉన్నది నేను కాదు, నా శవం మాత్రమే. క్లిష్టపరిస్థితుల్లో ఉన్న అన్నాడీఎంకే పార్టీని పన్నీర్‌సెల్వం, దీపా కలిసి కాపాడాలి. రెండాకుల గుర్తును వారే కాపాడగలరు. పన్నీర్‌సెల్వానికి ఎల్లవేళలా తోడుగా ఉంటాను' అని కేకలేశాడు. అంతే.. చుట్టుపక్కలున్నవారు ఆయనకు పూజలు, పునస్కారాలు చేసి శాంతింపజేయడం గమనార్హం. ఆ తర్వాత పన్నీర్ సెల్వంను కలిసి తన మనసులోని మాటను వెల్లడించి వెళ్లిపోయారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments