Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ' అంత్యక్రియల కోసం సాహసం చేసిన ప్రణబ్.. చెక్క బెంచీపై సీటు బెల్టు పెట్టుకుని ప్రయాణం!

రాష్ట్రపతి.. దేశాధిపతి. త్రివిధ దళాధిపతి. అలాంటి వ్యక్తి.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల కోసం పెను సాహసమే చేశారు. అదేంటో ఓసారి పరిశీలిద్ధాం. సోమవారం రాత్రి కన్నుమూసిన జయలలిత అంత్యక్రియలు మంగ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (16:13 IST)
రాష్ట్రపతి.. దేశాధిపతి. త్రివిధ దళాధిపతి. అలాంటి వ్యక్తి.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల కోసం పెను సాహసమే చేశారు. అదేంటో ఓసారి పరిశీలిద్ధాం. సోమవారం రాత్రి కన్నుమూసిన జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం మెరీనా తీరంలో జరిరగింది. ఈ అంత్యక్రియలకు ముందు జయలలిత పార్థివదేహాన్ని చెన్నైలోని రాజాజీ హాల్‌లో ఉంచారు. అక్కడకు వచ్చి జయలలిత భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పెద్ద సాహసమే చేశారు. 
 
ఢిల్లీ నుంచి చెన్నైకు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన లగ్జరీ ప్లేన్ బోయింగ్ 737లో చేరుకున్న ప్రణబ్‌.. అక్కడి నుంచి మెరీనా తీరానికి చేరుకునేందుకు ఎయిర్‌ఫోర్స్ వాళ్లు రవాణకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్‌ను ఎక్కాల్సి వచ్చింది. కాగా, ఈ హెలికాప్టర్‍లో బోయింగ్‌లాగా లగ్జరీ సీట్లు ఉండవు. దీంతో ప్రణబ్ ఓ బెంచ్‌పై సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించారు. అంతకుముందు ఢిల్లీ నుంచి చెన్నై రావడానికి మొదట ప్రణబ్ బయలుదేరినా.. విమానంలో సాంకేతిక లోపం కారణంగా బయలుదేరిన కొద్దిసేపటికే మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు.
 
ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన కాసేపటి తర్వాత ప్రణబ్ మళ్లీ చెన్నై బయలుదేరారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే.. ఆయనను మెరీనా బీచ్‌కు తీసుకెళ్లడానికి ఎంఐ-17 హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచారు. రాష్ట్రపతి స్థాయి వ్యక్తి ప్రయాణించడానికి అంత అనువుగా లేకపోయినా.. ప్రణబ్ మాత్రం అప్పటికే ఆలస్యం కావడంతో అందులోనే మెరీనా తీరానికి చేరుకునేందుకు సాహసం చేశారు. దీంతో ఆయన జయలలిత అంత్యక్రియలకు ముందే హాజరయ్యారు. జయలలిత పార్థివదేహానికి నివాళుర్పించి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments