Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయు కాలుష్య కారకులపై ఉక్కుపాదం.. ఐదేళ్ల జైలు.. రూ.కోటి ఫైన్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (18:12 IST)
వాయు కాలుష్యంపై కేంద్రం కన్నెర్రజేసింది. ఇకపై వాయు కాలుష్యానికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపనుంది. ఎవరైనా గాలిని కలుషితం చేస్తే మాత్రం కేంద్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదు. ఇలాంటి వారిని గుర్తించి, ఐదేళ్ళ జైలుశిక్షతో పాటు.. కోటి రూపాయల వరకు అపరాధం విధించనుంది. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాజముద్ర వేశారు. 
 
వాస్తవానికి వాతావరణ కాలుష్యం వల్ల దేశం అన్ని విధాలుగా తీవ్రంగా నష్టపోతోంది. ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమేకాకుండా, పర్యావరణం కూడా నాశనమవుతోంది. ఈ నేపథ్యంలో వాయుకాలుష్య కారకులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 
 
వాయుకాలుష్య కారకులకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, ఒక కోటి రూపాయల వరకు జరిమానా విధించేందుకు ఈ ఆర్డినెన్స్ అవకాశం కల్పించింది. ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.
 
కేంద్ర ఆర్డినెన్స్ ప్రకారం ప్రకారం ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిషన్ ఛైర్మన్‌ను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. 
 
కమిటీలో సభ్యులుగా వాణిజ్య శాఖ, రవాణా శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు, కేబినెట్ సెక్రటరీ ఉంటారు. ఈ కమిషన్ ఇచ్చే ఆదేశాలను సివిల్ కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు. కేవలం జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌లో మాత్రమే సవాలు చేయవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments