Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త బట్టలు ఇప్పిస్తానని చెప్పి... గర్భవతిని చంపేసిన కన్నతండ్రి

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (12:52 IST)
కన్నబిడ్డ ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని కన్నతండ్రి జీర్ణించుకోలేక పోయాడు. పైగా, ఆమె గర్భవతికావడంతో ఆగ్రహం చెందిన కన్నతండ్రి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కొత్తబట్టలు తీసిస్తానని చెప్పి ఇంటికి తీసుకొచ్చి హత్య చేశాడు. ఈ దారుమం మహారాష్ట్రలో ఘట్కోపర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. మహరాష్ట్రలోని ఘట్కోపర్‌ అనే ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తికి మీనాక్షి చౌరాసియా(20) అనే కుమార్తె ఉంది. మీనాక్షి గత కొంతకాలం నుంచి బ్రజేష్ చౌరాసియా అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన రాజ్‌కుమార్ కుమార్తెకు పెళ్ళిచేసేందుకు సంబంధాలు చూడసాగారు. ఇంతలో మీనాక్షి చౌరాసియా బ్రజేష్‌ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి రాజ్‌కుమార్‌కు ఇష్టం లేదు. మీనాక్షి, బ్రజేష్ వారి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ జీవిస్తున్నారు. 
 
ఇటీవలే మీనాక్షి గర్భవతి అయింది. విషయం తెలుసుకున్న రాజ్‌కుమార్.. కొత్తబట్టలు ఇప్పిస్తాను, ఇంటికి రావాలని మీనాక్షికి కబురుపెట్టాడు. దీంతో ఆనందంతో మీనాక్షి తన ఇంటికి ఆదివారం వచ్చింది. ఇక ఉద్దేశపూర్వకంగా డబ్బును మీనాక్షి చేతికి ఇవ్వకుండా కింద పడేశాడు రాజ్‌కుమార్. మీనాక్షి కిందకు వంగిన సమయంలో రాజ్‌కుమార్ ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రాజ్‌కుమార్ తప్పించుకోగా, అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం