యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఠాగూర్
ఆదివారం, 31 ఆగస్టు 2025 (13:55 IST)
యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 'ప్రతిభా సేతు' పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. దీని ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు మన్‌కీ బాత్‌ 125వ కార్యక్రమంలో మోడీ తెలిపారు. దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఒకటని.. ప్రతి యేడాది ఎంతో మంది అభ్యర్థులు రాస్తుంటారన్నారు. ఎంతో సమయం, డబ్బును ఖర్చు చేసి నిజాయతీగా కష్టపడుతున్న అభ్యర్థులు ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్‌ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నారని.. ఇలాంటి వారి కోసం ‘ప్రతిభా సేతు’ పోర్టల్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
 
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయన్నారు. అనేక రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని.. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారన్నారు. తీవ్రంగా శ్రమిస్తున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు, భద్రతా దళాలు, సామాజిక కార్యకర్తలు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
 
వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలు జమ్మూకశ్మీర్‌ను అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. అనేక విషయాల్లో ముందుకు వెళ్తుందన్నారు. ఇటీవల శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో నిర్వహించిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌ గురించి మోదీ ప్రస్తావించారు. దేశ్యాప్తంగా 800 మందికి పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారన్నారు. పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్లు కూడా ఇందులో ప్రతిభ చూపారన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా కాశ్మీర్‌లోని పుల్వామాలో తొలి సారిగా డే-నైట్ క్రికెట్ మ్యాచ్ జరిగిందని పేర్కొన్నారు. దేశం మార్పువైపు పయనిస్తోందనడానికి ఇవి ఉదాహరణగా నిలిచాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments