Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ లోకంలో పేరుమోసిన 'ఈవ్‌ టీజర్' శ్రీకృష్ణుడే.. ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద ట్వీట్స్

ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను వేధించే వారి భరతం పట్టేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్‌లపై ఆ

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (08:41 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను వేధించే వారి భరతం పట్టేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్‌లపై ఆయన స్పందించారు. "రోమియో కేవలం ఒక్క అమ్మాయినే ప్రేమించాడు. మరోవైపు కృష్ణుడు పేరుమోసిన ఈవ్‌ టీజర్‌ (అమ్మాయిలను ఏడిపించేవాడు). ఈ లెక్కన యోగి ఆదిత్యనాథ్‌కు తన యాంటీ రోమియో స్క్వాడ్స్‌ను యాంటీ కృష్ణా స్క్వాడ్స్‌ అనే దమ్ముందా?" అంటూ ట్వీట్‌ చేశారు. 
 
ఇంతటితో ఆయన ఆగలేదు. హిందూ పురాణాల్లో కొందరు దేవుళ్లు ‘ఈవ్‌ టీజర్స్‌’ అయినా కూడా వారిని దేవుళ్లుగా కొలుస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆయనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వెంటనే ప్రశాంత్ భూషణ్‌ తన ట్వీట్‌ను సమర్థించుకుంటూ.. 'రోమియో బ్రిగేడ్‌ మీద నా ట్వీట్‌ను వక్రీకరించారు. నా ఉద్దేశం ఏంటంటే.. ఏ లాజిక్‌తో అయితే రోమియో బ్రిగేడ్‌ను పెట్టారో, దాని ప్రకారం కృష్ణుడు కూడా ఈవ్‌ టీజరే అవుతాడు కదా' అంటూ మరో ట్వీట్‌ చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments