Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణుడు రోమియో వ్యాఖ్యలు : క్షమాపణలు చెప్పిన ప్రశాంత్ భూషణ్

హిందూ ప్రజలు ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణుడుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ వెనక్కి తగ్గారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాణలు చెప్పారు. మహిళలను వేధించేవారి భరతంపట్టేందు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (14:26 IST)
హిందూ ప్రజలు ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణుడుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ వెనక్కి తగ్గారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాణలు చెప్పారు. మహిళలను వేధించేవారి భరతంపట్టేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్‌లపై ఆయన స్పందిస్తూ "రోమియో కేవలం ఒక్క అమ్మాయినే ప్రేమించాడు. మరోవైపు కృష్ణుడు పేరుమోసిన ఈవ్‌ టీజర్‌ (అమ్మాయిలను ఏడిపించేవాడు). ఈ లెక్కన యోగి ఆదిత్యనాథ్‌కు తన యాంటీ రోమియో స్క్వాడ్స్‌ను యాంటీ కృష్ణా స్క్వాడ్స్‌ అనే దమ్ముందా?" అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. శ్రీకృష్ణుడుతో పాటు.. యాంటీ రోమియా స్క్వాడ్స్‌పై తాను చేసిన వ్యాఖ్యలు ఎంతో మందిని బాధించాయనే విషయాన్ని గ్రహించారు. అందుకే.. క్షమాపణలు చెపుతూ.. ఆ ట్వీట్స్‌ను డిలీట్ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments