Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆశలు వదులుకున్నట్టేనా? మరింత విషమంగా మారిన ప్రణబ్ ఆరోగ్యం?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (18:07 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ఇప్పటికీ ఆయన కోమాలోనే ఉన్నట్టు ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్య వర్గాలు బుధవారం విడుదల చేసిన ఓ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్‌ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. 
 
ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ప్రణబ్‌కు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments