Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. ఏడుగురు మహిళలకు చోటు.. ఆ ఇద్దరు రాజీనామా

Webdunia
బుధవారం, 7 జులై 2021 (23:22 IST)
కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు నేపథ్యంలో సీనియర్‌ కేంద్ర మంత్రులైన రవి శంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా తమ మంత్రి పదవులకు బుధవారం రాజీనామా చేశారు.

కేంద్ర మంత్రి వర్గం మెగా విస్తరణ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా తమ పదవులను వీడారు. ట్విట్టర్‌తో వివాదం, కొత్త ఐటీ రూల్స్‌పై అన్ని రంగాల నుంచి విమర్శలు రావడంతో రవి శంకర్‌ ప్రసాద్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు సమాచారం.
 
మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తోపాటు, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్ష వర్థన్‌, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌, సదానంద గౌడ వంటి సీనియర్‌ నేతలు, కీలక మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. 
 
మరోవైపు నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మీనాక్షి లేఖి బీజేపీ జాతీయ ప్రతినిధిగానూ పనిచేశారు. పలు సామాజిక సంస్ధల్లో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఇక యూపీలోని మిర్జాపూర్‌లో అప్నాదళ్ ఎంపీగా ఎన్నికైన అనుప్రియా సింగ్ పటేల్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments