Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలతో వెబ్‌సైట్లు... సభ్యత్వ రుసుంగా రూ.2.4 కోట్లు వసూలు!

పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలతో వెబ్‌సైట్లు నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అశ్లీల వెబ్‌సైట్లు వీక్షించేందుకు సభ్యత్వ రుసుంగా రూ.2.4 కోట్లు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Webdunia
బుధవారం, 27 జులై 2016 (12:58 IST)
పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలతో వెబ్‌సైట్లు నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అశ్లీల వెబ్‌సైట్లు వీక్షించేందుకు సభ్యత్వ రుసుంగా రూ.2.4 కోట్లు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నయ్ నగరానికి చెందిన సిద్ధార్థ వేలు, అతని భార్య ప్రిస్కిల్లా మార్గరెట్ ధన్‌రాజ్‌లు కలిసి ఈ వెబ్‌సైట్‌లు నడుపుతున్నారని, ఈ వెబ్‌సైట్‌లకు వారి ఈమెయిల్ ఐడీలను సైతం లింక్ చేశారని పోలీసుల విచారణలో తేలింది. సభ్యత్వ రుసుం కింద రెండు అశ్లీల వెబ్‌సైట్‌లకు రూ.2.4 కోట్లు బెంగళూరులోని సిద్ధార్థ వేలు బ్యాంకు ఖాతాలోకి వచ్చాయని వెల్లడైంది. 
 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు కింద అశ్లీల వెబ్‌‌సైట్లు నిర్వహించిన దంపతులపై కేసు నమోదు చేసి వారి వద్ద ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నయ్ కేంద్రంగా ఈ వెబ్ సైట్‌ల హోస్టింగ్ సాగుతుందని సైబర్ క్రైం విభాగం పరిశోధనలో వెల్లడైంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం