Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలిచిత్రాలకు బానిస.. రోడ్డుపై నడుస్తూ వెళ్లిన మహిళను అలా తాకుతూ.. చివరికి అరెస్ట్

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (09:37 IST)
రోడ్డుపై ఒంటరిగా వెళ్లే మహిళలను వేధిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. నీలి చిత్రాలకు బానిసగా మారిన ఆ యువకుడు మహిళల ప్రైవేట్ పార్ట్స్‌ని తాకుతూ పైశాచిక ఆనందం పొందుతుండేవాడు. 
 
దినేష్ కుమార్(20) హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడు. ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండటంతో ఇప్పుడు ఇంటి వద్దే ఉంటున్నాడు. అతడికి మహిళల ప్రైవేట్ పార్ట్స్‌ను చూస్తూ పైశాచిక ఆనందం పొందడం అలవాటు. అతడు హోటల్‌లో పని ముగించుకున్న తర్వాత నేరుగా ఇంటికి వెళ్లేవాడు కాదు.
 
ఒంటరిగా మహిళలు కనిపిస్తే ఫాలో చేసి ఆమె శరీరంలోని పై భాగాలను నొక్కి వెంటనే బైక్ పై పారిపోయేవాడు. ఇలా చాలా మందిని వేధించాడు. దినేష్ ఇటీవల ఓ యువతిని అడ్డగించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్లు వచ్చి దినేష్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు.
 
బాధిత యువతి అన్నా నగర్ పోలీస్ స్టేషన్‌లో దినేష్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బైక్ నంబర్‌ ను గుర్తించి, బైక్‌ పై వెళుతూ వేధింపులకు పాల్పడుతోంది దినేషే అని తేల్చారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. దినేష్ కుమార్ నీలి చిత్రాలకు బానిసగా మారాడని, అతని ఫోన్‌లో అన్ని నీలి చిత్రాల వీడియోలే ఉన్నాయని తెలిపారు. దినేష్‌ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments