Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి దర్శనం కోసం వస్తే శీలాన్ని దోచుకున్నారు.. రష్యా యువతిపై గ్యాంగ్ రేప్

స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ రష్యా యువతిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఆలయాల నగరం (టెంపుల్ సిటీ)గా పేరొందిన తిరువణ్ణామలై జిల్లాలో జరిగింది. అదీకూడా తమిళనాడు రాష్ట్ర రా

Webdunia
బుధవారం, 18 జులై 2018 (09:21 IST)
స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ రష్యా యువతిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఆలయాల నగరం (టెంపుల్ సిటీ)గా పేరొందిన తిరువణ్ణామలై జిల్లాలో జరిగింది. అదీకూడా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 12 యేళ్ల చెవిటి బాలికపై 24 మంది కామాంధులు ఏడునెలలపాటు అఘాయిత్యం చేసిన ఘటన మరవక ముందే వెలుగులోకి రావడం గమనార్హం.
 
తిరువణ్ణామలైలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి దర్శనార్థం ఓ రష్యా యువతి వచ్చింది. ఆమె స్వామి దర్శనం అనంతరం తాను అద్దెకు తీసుకున్న సర్వీస్డ్ అపార్ట్‌మెంట్‌కెళ్లి బస చేసింది. అక్కడే ఆమెపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి అపస్మారక స్థితిలో పడి ఉండగా రెస్టారెంట్ సిబ్బంది గుర్తించి ఆసుపత్రికి తరలించారు. 
 
ఆమెను పరిశీలించిన వైద్యులు అత్యాచారానికి గురైందని నిర్ధారించారు. రష్యా యువతి శరీరంపై రక్కిన గాయాలున్నాయి. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు తేల్చారు. అలాగే, రష్యా దేశ యువతి బస చేసిన సర్వీస్ అపార్టుమెంటులో డ్రగ్స్‌ను పోలీసులు కనుగొన్నారు. 
 
దేవాలయం, ఆశ్రమంలో ఆమె వెంట ఉన్న వారే అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెపుతున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. 
 
కాగా రష్యా యువతి తన సర్వీసు అపార్టుమెంటుకు రమ్మని ఆహ్వానిస్తేనే వెళ్లి ఆమె అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నామని ఓ నిందితుడు చెప్పడం కొసమెరుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం