Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ తాగి ఇద్దరు మహిళల మృతి: టీలో పురుగుల మందు ఎలా కలిసింది?

టీకి వేళాయె అనుకుని వేడి వేడి టీని తాగారు. అయితే టీ రూపంలో ఇద్దరు మహిళలను యముడు వెతుక్కుంటూ వచ్చాడు. టీ తాగిన పాపానికి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (15:12 IST)
టీకి వేళాయె అనుకుని వేడి వేడి టీని తాగారు. అయితే టీ రూపంలో ఇద్దరు మహిళలను యముడు వెతుక్కుంటూ వచ్చాడు. టీ తాగిన పాపానికి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని సొత్వా గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన వారంతా సోమవారం టీ తాగిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. 
 
పురుగు మందు కలిసిన టీని తాగేయడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా అనారోగ్యం పాలైయ్యారని డీఎస్పీ శివకుమార్ రౌత్ చెప్పారు. ఆ టీలో పురుగుమందు కలిసిందని ఆయన వివరించారు. ఈ ఘటనలో  దీంతో జస్వంతి దేవి (65), ఆమె కుమార్తె షీలా దేవి (45) మరణించారని, మరో ఆరుగురు అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. 
 
మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, అనారోగ్యానికి గురైన వారికి ఆస్పత్రిలో చేయిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. టీలో పురుగుల మందు ఎలా కలిసిందనే దానిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments