Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయం సింగ్ కుటుంబ కూకటి వేళ్లను పీకేసిన నరేంద్ర మోడీ...

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అగ్రనేత ములాయంసింగ్‌ యాదవ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. సకుటుంబ సపరివార సమేతంగా ఎస్పీ తరపున పోటీచేసిన ఆయన బంధుగణమంతా భాజపా జెండా రెపరెపలకు ఎగిరిపోయారు.

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (08:07 IST)
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అగ్రనేత ములాయంసింగ్‌ యాదవ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. సకుటుంబ సపరివార సమేతంగా ఎస్పీ తరపున పోటీచేసిన ఆయన బంధుగణమంతా భాజపా జెండా రెపరెపలకు ఎగిరిపోయారు. మల్లయోధుడు పుట్టి పెరిగిన ‘ఇటావా’ జిల్లాలో ఒక్కసీటు కూడా ఎస్పీ గెలుచుకోలేక పోయింది. అయితే, ఒక్క ఒక్క శివపాల్‌యాదవ్‌ మాత్రం గుడ్డిలో మెల్లగా గెలుపుతీరాలకు చేరుకున్నారు. 
 
ముఖ్యంగా, గత 18 ఏళ్లుగా లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కనౌజ్‌లో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే నామమాత్రపు మెజార్టీతో దక్కించుకోగలిగారు. లఖ్‌నౌ కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసిన రెండో కోడలు అపర్ణాయాదవ్‌ను గెలిపించాలని పెద్దకోడలు డింపుల్‌తో కలసి ప్రచారం చేసినా ఓటర్లు కనికరంచూపలేదు. 
 
'నేను గెలిచి చూపిస్తా అంటూ' బరిలోకి దిగిన స్వాతిసింగ్‌ (భాజపా) దూకుడుకు ఆయన మేనల్లుడు అనురాగ్‌యాదవ్‌ ఓడిపోవడాన్ని అడ్డుకోలేకపోయారు. ములాయం సొంతజిల్లా ఇటావాలో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఇక్కడి మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటీ ఆ పార్టీ గెలవలేకపోయింది. ఐదుకు ఐదుస్థానాల్లోనూ భాజపా అభ్యర్థులే విజయబావుటా ఎగురవేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments