Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువుల్లో యాక్టివ్ కాదు.. నరేంద్ర మోడీ : నేడు మంత్రులకు విందు!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (14:29 IST)
తాను చదువులో అంత యాక్టివ్ కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైద్య విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. 
 
చదువులో తాను ఏమంత యాక్టివ్ కాదని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ అవార్డులు అందుకోలేదని తెలిపారు. చదువును నేర్చుకోవాలన్న తపన, ఏకలవ్యుడి లాంటి మేధస్సు కలిగి ఉండాలని సూచించారు. వైద్యరంగంలో పరిశోధనలపై దృష్టిపెట్టాలని సలహా ఇచ్చారు. 
 
మరోవైపు.. సోమవారం రాత్రి తన మంత్రివర్గ సహచరులకు మోడీ విందు ఇవ్వనున్నారు. ఇందులో మొత్తం 44 మంది మంత్రులు హాజరుకానున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ మంత్రివర్గ సహచరులకు విందు ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
పలు కీలక అంశాలపై మంత్రులతో మనసు విప్పి చర్చించేందుకే మోడీ ఈ విందును ఏర్పాటు చేశారని తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ప్రభుత్వం అనుసరించాల్సిన విధివిధానాలపై భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ విందులో మంత్రులతో మోడీ చర్చించనున్నారని సమాచారం. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments