కాంగ్రెస్ వల్లే శరద్ పవార్ ప్రధాని కాలేకపోయారు : ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (14:49 IST)
కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల వల్ల ప్రతిపక్షాలలోని ప్రతిభావంతులైన నేతలు కూడా తగిన స్థానం పొందడంలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ప్రధాని కాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఈ మేరకు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీల సమావేశంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై మోడీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తన స్వార్థ రాజకీయాలే తప్ప ఇతరులు, దేశ ప్రయోజనాలపై పట్టింపులేదని మండిపడ్డారు. కాంగ్రెస్ రాజకీయాలతో ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటి నేతలు ప్రధాని పీఠంపై కూర్చోలేకపోయారని మోడీ విమర్శించారు. ఇకపైనా పవార్ ప్రధాని అయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పారు.
 
ఇలాంటి నేతలంతా ఎంతో సమర్థులేనని, ప్రధాని పదవికి అర్హులేనన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఎన్డీయే కూటమిలో మాత్రం అలాంటి స్వార్థ రాజకీయాలకు చోటులేదని మోడీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. కూటమిలో మిత్రపక్షాలు, వారి ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమేనని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని మోడీ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments