Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దుతోనే ఇలా జరుగుతుందా .. మంత్రులతో నరేంద్ర మోడీ మంతనాలు

పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులతో పాటు... ఆర్థిక శాఖ ఉన్నతాధితారులతో ఆదివారం అర్థరాత్రి వరకు మంతనాలు జరిపారు. దేశ వ్యాప్తంగా ఒకే

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (10:21 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులతో పాటు... ఆర్థిక శాఖ ఉన్నతాధితారులతో ఆదివారం అర్థరాత్రి వరకు మంతనాలు జరిపారు. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయంటూ వారిని ఆయన ప్రశ్నించారు. 
 
పెద్ద నోట్ల రద్దు, తదనంతరం ఏర్పడిన పరిణామాలు, ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కట్టడం, విపక్షాల విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. దీంతో ప్రధాని మోడీ ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుఝాము వరకూ కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మోడీ సమావేశం నిర్వహించగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పీయుష్ గోయల్‌లతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 
బ్యాంకుల చెంత పరిమిత సంఖ్యలోనే కొత్త నోట్లు లభిస్తుండటం, బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజల బారులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్న వదంతులు వంటి అంశాలపై ప్రధాని చర్చించారు. సమస్యలన్నీ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలని, ప్రజలకు ఇబ్బందులు రానీయకుండా చూడాలని ఈ సందర్భంగా మోడీ మంత్రివర్గ సహచరులను కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments