Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్లో ప్రధాని పొరపాటు.. గనికి విషెస్.. గూగుల్ తప్పేనా? మోడీదా?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (11:43 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్లో చిన్న పొరపాటు చేశారు. దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ మోడీ దేశంలోని ప్రముఖులందరికీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనికి నిన్న(శుక్రవారం) ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి గని పుట్టిన రోజు మే 19న కావడం గమనార్హం. అది తెలియకుండా ముందుగానే గనికి మోడీ శుభాకాంక్షలు తెలపడం వివాదాస్పదమైంది. 
 
గూగుల్‌లో గని పుట్టిన రోజు శుక్రవారం అని ఉండటంతోనే మోడీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. కాగా మోడీ ట్వీటుకు స్పందించిన అష్రఫ్ ముందుగా కృతజ్ఞతలు చెప్పారు. అయితే తన పుట్టిన రోజు ఇవాళ కాదని... మే 19న అని తర్వాత అసలు విషయాన్ని చల్లగా చెప్పారు. ఈ పొరపాటుకు పలువురు సోషల్ మీడియాలో మోడీని విమర్శిస్తే... గూగుల్‌లో ప్రముఖుల పుట్టినరోజు తేదీలను సరిగా అప్ డేట్ చేయడం లేదని మరి కొంతమంది అంటున్నారు. గూగుల్ తప్పిదంతోనే మోడీ ఇలా చేయాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments