Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలాం స్మారకార్థం అయోధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్.. జెండాఊపనున్న ప్రధాని మోడీ

మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం రెండో వర్థంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. భారత రక్షణ రంగ పరిశోధనా, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మించిన స్మారక మండపంతో పాటు.. సైన్స్ నాలెడ్జ్ పార్కును

Webdunia
గురువారం, 27 జులై 2017 (11:09 IST)
మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం రెండో వర్థంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. భారత రక్షణ రంగ పరిశోధనా, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మించిన స్మారక మండపంతో పాటు.. సైన్స్ నాలెడ్జ్ పార్కును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు. ఈ మండపం.. కలాంను ఖననం చేసిన రామేశ్వరంలోని పేయికరంబు ప్రాంతంలో నిర్మించారు. దీన్ని ప్రారంభం కోసం ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి రామేశ్వరంకు చేరుకుంటారు. అలాగే, గ్రీన్ రామేశ్వరం ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభిస్తారు. 
 
ఈ స్మారక మందిరం ప్రారంభం తర్వాత కలాం స్మారకార్థం రామేశ్వరం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైసలాబాద్ వరకు నడిచే అయోధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఆయన జెండాఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రామేశ్వరం తర్వాత మానామదురై, తిరుచ్చి, తంజావూరు, విలుపురం, చెన్నై ఎగ్మోర్‌, గూడూరు, విజయవాడ, వరంగల్‌, బల్హార్షా, నాగ్‌పూర్‌, ఇటార్సీ, సాత్నా, అలహాబాద్‌, జౌన్పూర్‌, అయోధ్య స్టేషన్‌లలో ఆగుతుంది. 
 
16793 నంబరుతో నడిచే రెగ్యులర్‌ వీక్లీ రైలు రామేశ్వరంలో ప్రతి ఆదివారం రాత్రి 23.50 గంటలకు బయలుదేరి చెన్నైకి మరుసటి రోజు సాయంత్రం 15.00 గంటలకు చేరుకుంటుంది. అలాగే, గమ్యస్థానమైన ఫైసలాబాద్‌కు బుధవారం ఉదయం 8.30 గంటలకు చేరుతుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో (రైలు నంబరు 16794) ప్రతి బుధవారం రాత్రి 23.55 గంటలకు ఫైసలాబాద్‌లో బయలుదేరి చెన్నైకి మరుసటి రోజు సాయంత్రం 18.35 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి రామేశ్వరానికి శనివారం ఉదయం 8.50 గంటలకు చేరుతుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments