Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి మోడీ తల్లికి అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (14:15 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ యేడాది జూన్ నెలలో వందో యేటలోకి అడుగుపెట్టిన హీరా బెన్... గత 1923 జూన్ 13వ తేదీన జన్మించారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ గాంధీ నగర్‌లోని తన సోదరుడు పంకజ్ మోడీ నివాసానికి ప్రధాని మోడీ వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వందో పుట్టిన రోజు సందర్భంగా తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్టు ప్రధాని మోడీ ఓ ట్వీట్ కూడా చేశారు. 
 
ఆ సమయంలో తన తల్లితో అర గంట పాటు ముచ్చటించి ఆమెతో కలిసివున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అస్వస్థతకు లోనుకావడంతో ప్రధాని మోడీ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ తల్లిని చూసేందుకు ఆయన గుజరాత్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో గుజరాత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాని ఏ క్షణంలో గుజరాత్‌కు వచ్చినా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు  సిద్ధంగా ఉన్నారు. 
 
మరోవైపు, మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ దామోదరన్ దాస్ మోడీ కారు బాగా దెబ్బతింది. ఆ సమయంలో ప్రహ్లాద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బెంజ్ కారులో ఉన్నారు. ఈ కారు మైసూరు నుంచి బందీపూర్ వైవు వెళుతుండగా, కడకోల సమీపంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రహ్లాద్ మోడీ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments