Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ బాటలో అమెరికా, రష్యా: జన్ ధన్ తరహా పథకాలకు రెడీ!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (14:06 IST)
భారత ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ బాటలోనే అమెరికా, రష్యా వంటి దేశాలు పయనించేందుకు రెడీఅవుతున్నాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనపై అమెరికా, రష్యా లాంటి దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. త్వరలో ఆ దేశాల్లో జన్ ధన్ తరహా పథకాలు అమలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 
 
ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక సంస్థ ‘ద ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ ప్రస్తుతం జన్ ధన్‌పై భారత ప్రభుత్వం అందజేసిన నివేదికను ఆమోదించిందట. జన్ ధన్ యోజన లక్ష్యాలు, అనతి కాలంలోనే ఈ పథకం దిగ్విజయమైన తీరు, నో యువర్ కస్టమర్ తరహా వ్యవస్థలపై భారత ప్రభుత్వం ఆ సంస్థకు నివేదిక అందించింది. సదరు నివేదికను అధ్యయనం చేసిన ఆ సంస్థ ఫథకం విజయవంతమైన తీరును ప్రపంచ దేశాలకు వివరించనుంది. 
 
దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంకు ఖాతా అయినా ఉండాలన్న యోచనతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకానికి తెర తీసిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు కంటే ముందుగానే ఈ పథకానికి భారీ స్పందన వచ్చిందని టాస్క్ ఫోర్స్ సంస్థ వెల్లడించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments