Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రుల్లో నిండుకుంటున్న బెడ్లు... మంత్రులతో ప్రధాని అత్యవసర భేటీ!

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (09:01 IST)
కరోనా వైరస్ బారినపడుతున్న రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా ఆస్పత్రుల్లోని ఐసీయూ వార్డుల్లో ఉన్న బెడ్లు నిండుకుంటున్నాయి. దీంతో కొత్త రోగులను చేర్చుకునే పరిస్థితి లేదు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు హాజరయ్యారు. 
 
ఇందులో కరోనా వ్యాప్తి, వైరస్ నివారణను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు. దేశంలో మరోమారు సంపూర్ణ లాక్డౌన్‌ను విధించాలన్న చర్చ కూడా వీరి మధ్య వచ్చినట్టు పీఎంఓ వర్గాల సమాచారం. 
 
అయితే, కేసులు అత్యధికంగా ఐదు రాష్ట్రాల నుంచే వస్తున్నందున, ఆ రాష్ట్రాల్లో మాత్రం కఠిన నిబంధనలను అమలు చేస్తూ, ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, మిగతా రాష్ట్రాలను మినహాయించాలన్న చర్చ కూడా వీరి మధ్య వచ్చిందని తెలుస్తోంది. మరోసారి లాక్డౌన్ విధించే విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నరేంద్ర మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం దేశ రాజధానిలో పరిస్థితిని సమీక్షించి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నరులతో అమిత్ షా భేటీ కావాలని, వాస్తవ స్థితిగతులను సమీక్షించాలని మోడీ ఆదేశించారు. ఆపై ఈ నెల 16, 17 తేదీల్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశమై, అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments