Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులూ... అశోక్‌ను చూసి నేర్చుకోండయ్యా? మోడీ ప్రశంస

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక గజపతి రాజుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మంచి ప్రశంస లభించింది. పైగా, మంత్రి అశోక్‌ను చూసి ప్రతి మంత్రీ నేర్చుకోవాలంటూ హితవు పలికారు. ఇంతకీ ప్రధాన

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (17:36 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక గజపతి రాజుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మంచి ప్రశంస లభించింది. పైగా, మంత్రి అశోక్‌ను చూసి ప్రతి మంత్రీ నేర్చుకోవాలంటూ హితవు పలికారు. ఇంతకీ ప్రధాని ఈతరహా వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటేనే విషయాన్ని పరిశీలిస్తే.. 
 
రాజ వంశానికి చెందిన అశోక్ గజపతి రాజు... కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఒక సాధారణ పౌరుడిలాగే ఉంటారు. ఎక్కడ కూడా రాజుననే గర్వం ఆయనలో మచ్చుకైనా కనిపించదు. అలాగే, వీఐపీ కల్చర్‌కు ఆమడదూరంలో ఉంటారు. ఈ లక్షణమే మోడీని ఎంతగానో ఆకర్షించింది. 
 
దీనికి కారణం లేకపోలేదు. అశోక్ గజపతి రాజు కేంద్ర కేబినెట్‌లో పౌర విమానయాన శాఖా మంత్రిగా ఉన్నప్పటికీ సాధారణ ప్రయాణికుని వలే ప్రయాణిస్తారు. కేంద్రమంత్రిగా ఆయన నేరుగా వెళ్లి విమానం ఎక్కే అవకాశం ఉంది. కానీ అశోక్ గజపతి రాజు అలా చేయరు. తనిఖీలు నిర్వహించే వారు వెళ్ళండి సర్ అని చెప్పినా ఆయన వెళ్లరు. 
 
తనిఖీ చేయడం మీ డ్యూటీ. చేయండి తప్పు లేదు అని అంటారు. మినానాశ్రయానికి చేరుకోవడానికి ఆయన మెట్రో రైలులో ప్రయాణిస్తారట. ఇలా నిడారంబరంగా మెలుగుతుండటంతో అశోక్ గజపతి రాజుపై మోడీ దృష్టి పడింది. మంత్రులంతా అశోక్ గజపతి రాజుని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని సూచించారంటే నిజంగా విశేషమే మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments