Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి షాకిచ్చిన బీజేపీ ఎంపీలు.. ఎక్కడ.. ఎందుకు?

భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చారు. పెద్దల సభ అయిన రాజ్యసభలో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదం తెలుపాల్సి ఉన్న తరుణంలో బీజేపీ ఎంపీలు సభకు డుమ్మా కొట్టారు.

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (12:26 IST)
భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చారు. పెద్దల సభ అయిన రాజ్యసభలో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదం తెలుపాల్సి ఉన్న తరుణంలో బీజేపీ ఎంపీలు సభకు డుమ్మా కొట్టారు. దీంతో విపక్షాలు సూచించిన కొన్ని స‌వ‌ర‌ణ‌ల‌తో బిల్లు పాస్ చేయాల్సిన అగత్యం ఏర్పడింది. నిజానికి బీజేపీ ప్రభుత్వానికి రాజ్య‌స‌భ‌లో అరకొరగానే మెజార్టీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి చెందిన ఎంపీలే డుమ్మా కొట్టడంతో మోడీ సర్కారు ఇరుకునపడినట్టయింది. 
 
ముఖ్యంగా బీసీ క‌మిష‌న్‌ను చ‌ట్ట‌బ‌ద్ధ సంస్థ హోదా నుంచి రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ‌గా మార్చ‌డానికి ఈ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఇది ఆమోదం పొంద‌డానికి స‌భ‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవ‌స‌రం. రాజ్య‌స‌భ‌లో స‌వ‌ర‌ణ‌ల‌తో ఆమోదం పొందిన బిల్లు మ‌రోసారి లోక్‌స‌భ‌కు పంపిస్తారు. 
 
బీసీ క‌మిష‌న్‌కు రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ హోదా వ‌చ్చిందంటే అది కోర్టుతో స‌మానం. బీసీల‌పై ఏవైనా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, వివ‌క్ష కేసుల్లో బాధ్యుల‌కు నేరుగా స‌మ‌న్లు జారీ చేయ‌డంతోపాటు విచార‌ణ‌కు కూడా ఆదేశించవ‌చ్చు. అంతటి ప్రాధాన్య‌త కలిగిన బిల్లుపై ఓటింగ్ సంద‌ర్భంగా 30 మంది బీజేపీ ఎంపీలు డుమ్మా కొట్ట‌ారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments