Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాళ్లు రువ్వితే ఏమీ సాధించలేం.. చదువుతోనే అన్నీ సాధ్యం.. నోట్ల రద్దు మంచిదే: నానా పాటేకర్

బాలీవుడ్ నటుల్లో ఒకరైనా నానా పటేకర్ నిర్ణయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. చిన్న చిన్న లోపాలపైనే ఆయన పోరాటం ఆలోచింపదగినదిగా ఉంటుంది. సినిమాల ద్వారా సందేశాలను చెప్పించే నానా పటేకర్ నోట్ల రద్దుపై సానుకూలంగా

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (15:37 IST)
బాలీవుడ్ నటుల్లో ఒకరైనా నానా పటేకర్ నిర్ణయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. చిన్న చిన్న లోపాలపైనే ఆయన పోరాటం ఆలోచింపదగినదిగా ఉంటుంది. సినిమాల ద్వారా సందేశాలను చెప్పించే నానా పటేకర్ నోట్ల రద్దుపై సానుకూలంగా స్పందించారు. దేశ వ్యాప్తంగా నోట్ల రద్దుపై నానా హంగామా జరుగుతున్న తరుణంలో పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని పాటేకర్ ప్రశంసించారు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందుల గురించి నానా పాటేకర్ స్పందిస్తూ.. ఎన్నో సంవత్సరాలుగా చాలా భరిస్తూ వచ్చామని, ఈ పది, ఇరవై రోజుల కష్టాన్ని భరించలేమా అంటూ ప్రశ్నించారు. 
 
జమ్మూ కాశ్మీర్‌లోని యువతను బుధవారం కలిసిన సందర్భంగా నానా పాటేకర్ మాట్లాడుతూ, యువత ముందుగా చదువుకోవాలన్నారు. చదువు ద్వారానే యువత దేశాన్ని అభివృద్ధి చేయగలరన్నారు. అంతేగానీ.. జమ్మూలో రాళ్లు రువ్వడం ద్వారా ఏమీ సాధించలేరని, అసలు దేశాన్ని మీదనుకుంటే తర్వాత అన్నీ సులభమవుతాయని నానా పాటేకర్ వ్యాఖ్యానించారు. 
 
సైనికుల గురించి మాట్లాడుతూ, సైనికులే తనకు బోలెడంత స్ఫూర్తినిచ్చారని.. వాళ్లను కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందని పాటేకర్ తెలిపారు. హోలీ, దీపావళి.. ఏ పండుగైనా వాళ్లకు మాత్రం లేదని, అయినా చాలా సంతోషంగా ఉన్నారని నానా పాటేకర్ గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments