Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్... వయనాడ్‌లో కూడా...

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (09:15 IST)
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 43 స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతుంది. అలాగే, కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభతో పాటు.. పది రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. 
 
అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజస్థాన్‌లో 7, పశ్చిమ బెంగాల్లో 6, అస్సాంలో 5, బీహార్‌లో 4, కేరళలో 3, మధ్యప్రదేశ్‌లో 2, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో ఒక్కో సీటుకు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
 
జార్ఖండ్‌తో పాటు ఉప ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతను మోహరించింది. కాగా జార్కండ్‌లో రెండో దశ ఎన్నికలు నవంబరు 20వ తేదీన జరగనున్నాయి. నవంబరు 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ అత్యధికంగా 30 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది. జేఎంఎం - కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమి మొత్తం 47 సీట్లతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments