Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ.15కే విక్రయం : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Webdunia
గురువారం, 6 జులై 2023 (10:51 IST)
తాను చెప్పిన సృజనాత్మక ఫార్ములాను పాటిస్తే దేశంలో లీటర్ పెట్రోల్‌ను రూ.15 కే విక్రయించవచ్చని కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో రవాణా అవసరాలకు సగటున 60 శాతం ఇథనాల్, 40 శాతం విద్యుత్ వినియోగిస్తే పెట్రోలు లీటరు ధర రూ.15కు చేరుకుంటుందని, అంతిమంగా ఇది సామాన్యులకు లాభిస్తుందన్నారు. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్‌‍గఢ్ నగరంలో జరిగిన ఓ సభలో మంత్రి గడ్కరీ పాల్గొని ప్రసంగిస్తూ, రైతులు కేవలం అన్నదాతలే కాదు, శక్తిదాతలు కూడా కాగలరని మా ప్రభుత్వం నమ్ముతోంది. త్వరలో దేశంలోని వాహనాలు 60 శాతం ఇథనాల్ కలిగిన ఇంధనంతో పరుగులు పెడతాయి. మరో 40 శాతం రవాణా ఖర్చుకు విద్యుత్ కూడా జతచేస్తే దేశంలో పెట్రోల్ సగటున లీటరు రూ.15కే లభిస్తుంది. ఇది సామాన్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని సెలవిచ్చారు.
 
ఇథనాల్ ఆధారిత ఇంధనంతో కాలుష్యం తగ్గడమేకాకుండా ఇంధన దిగుమతులు కూడా తగ్గుతాయని చెప్పారు. దిగుమతులపై ప్రస్తుతం ఖర్చు చేస్తున్న రూ.16 లక్షల కోట్లను రైతు శ్రేయస్సు కోసం వినియోగించవచ్చన్నారు. అంతకుమునుపు, నితిన్ గడ్కరీ ప్రతాప్‌గఢ్‌లో రూ.5600 కోట్లతో చేపట్టనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments