Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి శశిథరూర్ ... సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం

తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక పోత

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (11:42 IST)
తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. అలాగే, మణిపూర్, గోవాల్లో కూడా బొటాబొటి మెజార్టీనే వచ్చింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. 
 
ఈనేపథ్యంలో 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శశిథరూర్‌ను ప్రకటించాలంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని కేరళ తిరువనంతపురానికి చెందిన ఒక వ్యక్తి ప్రారంభించారు. 
 
శశిథరూర్ అత్యున్నత విద్యార్హతలు కలిగిన వ్యక్తి అని... జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో ఆయనకు ఉన్న పరిజ్ఞానం అమోఘమని... ప్రపంచ స్థాయి నాయకులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని సదరు వ్యక్తి గుర్తు చేస్తున్నారు. దేశ ప్రజలలో కూడా శశిథరూర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. శశిథరూర్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ఇప్పటివరకు 6,821 మంది నెటిజన్లు మద్దతు పలికారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments