Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దుపై దద్ధరిల్లిన లోక్‌సభ.. 21కు వాయిదా వేసిన స్పీకర్

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయం ఏకపక్షమని, ఈ అంశంపై తక్షణం చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ముఖ్యంగా.. బీజేపీ సభ్యుడు అనంత్ కుమార్, కాంగ్రెస్ సభాప

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (12:46 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయం ఏకపక్షమని, ఈ అంశంపై తక్షణం చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ముఖ్యంగా.. బీజేపీ సభ్యుడు అనంత్ కుమార్, కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మద్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. దీంతో పరిస్థితి అదుబు తప్పడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. 
 
అంతకుముందు... పార్లమెంట్ శీతాకాల స‌మావేశాల్లో మూడో రోజు కూడా పెద్ద‌నోట్ల‌పై గంద‌ర‌గోళం నెల‌కొంది. లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ ఆందోళ‌నల మ‌ధ్యే ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగింది. గురువారం కాంగ్రెస్ నేత‌ గులాబ్ న‌బీ ఆజాద్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స‌మాధానం చెప్పాల‌ని అధికార ప‌క్ష‌నేత‌లు, పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ప్ర‌ధాని మోడీ స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు నినాదాలు చేశారు. 
 
అయిన‌ప్ప‌టికీ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ప్ర‌శ్నోత్త‌రాల‌ను కొన‌సాగించారు. ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీపై ప్ర‌స్తావించారు. కేంద్రం ఇటీవ‌ల రాష్ట్రానికి ప్ర‌క‌టించిన ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త కావాల‌ని తాను ప్ర‌జ‌ల త‌ర‌పున అడుగుతున్నాన‌ని రామ్మోహ‌న్ నాయుడు కోరారు.
 
అలాగే, అన్నాడీఎంకే సభ్యుడు డాక్టర్ జే జయవర్థన్ మాట్లాడుతూ శ్రీలంక నావికాదళం భారతీయ జాలర్లపై అక్రమంగా కాల్పులు జరుపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు తీరంలో జరుగుతున్న ఈ దారుణాలపై భారతదేశ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ తమిళనాడు మత్స్యకారుల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, ఈ సమస్యను రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments