Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు అంటురోగముంటే అస్పత్రిలోనూ వెన్నంటే ఉన్న శశికళకు ఎందుకు అంటుకోలేదు?

అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు పలుమార్లు ఆమెను చూడడానికి ప్రయత్నించామని పొన్నయ్యన్ అన్నారు. అయితే, అమ్మకు భయంకరైన అంటు రోగం వచ్చినట్టు, ఈ ప్రభావం ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నట్టు ప్రచారాన్ని గు

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (20:01 IST)
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తీవ్ర అంటురోగం అంటుకున్నందుకే అపోలో ఆసుపత్రిలో ఆమెను కలిసేందుకు ఎవరినీ అనుమతించలేదని శశికళ వర్గం చేస్తున్న ప్రచారాన్ని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం తీవ్రంగా ఖండించింది. ఆదివారం చెన్నయ్‌లో పార్టీ వర్గాలతో పన్నీర్ సెల్వం సమావేశమైన సందర్బంగా పన్నీర్ శిబిరంలోని సీనియర్ నేత పొన్నయ్యన్ జయలలిత మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చశారు. 
 
అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు పలుమార్లు ఆమెను చూడడానికి ప్రయత్నించామని పొన్నయ్యన్  అన్నారు. అయితే, అమ్మకు భయంకరైన అంటు రోగం వచ్చినట్టు, ఈ ప్రభావం ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నట్టు ప్రచారాన్ని గుప్పించారని ఆరోపించారు. అయితే, అమ్మ వెన్నంటి శశికళ మాత్రమే ఉన్నారని, ఆమెకు మాత్రం ఆ రోగం ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
 
పోయెస్‌ గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రికి వచ్చేటప్పుడే అమ్మకు స్ప్పహ లేదన్న సమాచారాలు వస్తుండడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రి, శశికళకు మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉన్నట్టుందని, అందుకే అమ్మ ఆరోగ్య పరిస్థితి, మరణం గురించి పొంతనలేని సమాధానాలు, ప్రకటనల్ని చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. న్యాయ విచారణ జరిపించడం ద్వారా అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చి తీరుతాయన్నారు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments