Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మారక నిలయంగా పోయెస్ గార్డెన్ ఇల్లు . పన్నీర్ ఆదేశాలు : అడ్డుకుంటానన్న శశికళ

ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అత్యంత ప్రీతిపాత్రమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇపుడు పన్నీర్ సెల్వం - శశికళకు ఆధిపత్య పేరుకు కేంద్రంగా మారింది. జయలలిత ఇంటిని అమ్మా మెమోరియల్‌గా మార్చుతూ ఆపద్ధర్మ ముఖ

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (12:33 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అత్యంత ప్రీతిపాత్రమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇపుడు పన్నీర్ సెల్వం - శశికళకు ఆధిపత్య పేరుకు కేంద్రంగా మారింది. జయలలిత ఇంటిని అమ్మా మెమోరియల్‌గా మార్చుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం జీవో జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
జయలలిత మరణానంతరం శశికళతో పాటు... మన్నార్గుడి మాఫియా నివాసముంటుంది. అయితే వేద నిలయాన్ని జయలలిత స్మారకంగా మార్చుతానని పన్నీరు సెల్వం కొద్దిసేపటి క్రితం చెప్పారు. శశికళ, ఆమె కుటుంబం అక్రమంగా అక్కడ ఉంటున్నారని పన్నీరు సెల్వం ఆరోపించారు. దీనికి సంబంధించిన జీవో తయారు చేసి తీసుకునిరావాలని గురువారం తనను కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ను ఆదేశించినట్టు సమాచారం. 
 
మరోవైపు.. పన్నీర్ నిర్ణయాన్ని శశికళ తీవ్రంగా ఖండించారు. శశికళ ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని చెబుతున్నారు. జయలలిత నివాసమున్న ఆ ఇల్లు ఇళవరసి కొడుకు వివేక్ పేరు మీద ఉందని, ఇళవరసి స్వయానా శశికళ వదిన అని ఆమె వర్గీయులు పేర్కొంటున్నారు. వేద నిలయం ప్రభుత్వ ఆస్తి కాదని, ప్రైవేట్ ఆస్తి అని శశికళ వర్గీయులు వాదిస్తున్నారు. ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తే కోర్టును ఆశ్రయిస్తామని శశికళ వర్గం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో జయలలిత వేద నిలయం కూడా చర్చనీయాంశం కావడం గమనార్హం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments