Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పులి'గా మారిన 'పిల్లి'.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీరో అయిపోయిన పన్నీర్‌

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఒక్కసారి సోషల్ మీడియాలో రియల్ హీరోగా మారిపోయారు. ముఖ్యంగా నిన్నటి వరకు పిల్లిగా ఉన్న ఒక్కసారి పులిలా మారిపోయాడన్నారు. దీంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (12:40 IST)
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఒక్కసారి సోషల్ మీడియాలో రియల్ హీరోగా మారిపోయారు. ముఖ్యంగా నిన్నటి వరకు పిల్లిగా ఉన్న ఒక్కసారి పులిలా మారిపోయాడన్నారు. దీంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
 
అమ్మ జ‌య‌ల‌లిత వీర విధేయుడి తిరుగుబాటుతో అన్నాడీఎంకే ముఖచిత్రం మారిపోతోంది. త‌న బ‌ల‌మేంటో త్వ‌ర‌లోనే అంద‌రికీ తెలుస్తుంద‌ని ముఖ్య‌మంత్రి పన్నీర్‌ సెల్వం స‌వాల్ విస‌ర‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హీరో అయిపోయారు. 
 
మంగళవారం సాయంత్రం వరకు ప‌న్నీర్ సెల్వం ర‌బ్బ‌రు స్టాంపులాంటి వార‌ని నెటిజ‌న్లు జోకులు పేల్చుకున్నారు. స్త్రీల‌కు లేచి నిలబడి సీటు ఇచ్చే సంస్కారం ఉన్నవార‌ని సెటైర్లు వేశారు. కానీ, పన్నీరు సెల్వం తీరు మార్చుకొని త‌న అస‌లు స్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో బుధవారం ఆయ‌న‌పై నెటిజ‌న్లు కూడా తీరు మార్చుకొని ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఆయనను హీరోగా పేర్కొంటున్నారు.
 
ప‌న్నీర్‌ సెల్వంకు మద్దతుగా ప్రజలతో పాటు పలువురు డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కూడా సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మెరీనా బీచ్ వ‌ద్ద ప్రారంభించిన తిరుగుబాటులో ప‌న్నీర్ సెల్వం గెలిచి తీరుతార‌ని ఓ అభిమాని పేర్కొన్నాడు. అన్ని విషయాలను పన్నీర్ సెల్వం బయటకు చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments